Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ సీఎం రేస్ : పోటీపడిన ఆ ఇద్దరు.. రేవంత్‌కు ఎంతమంది సపోర్టు చేశారంటే..

revanthreddy
, బుధవారం, 6 డిశెంబరు 2023 (10:45 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి రేసుకు గట్టి పోటీ ఎదురైంది. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పోటీపడ్డారు. వారు ఎవరో కాదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క. అయితే, మెజార్టీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు. దీంతో ఆయన పేరును ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. 
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. వీరిలో 42 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అండగా నిలించారు. మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు రేవంత్ వైపు మొగ్గు చూపడంతో, దీనిని పరిగణనలోకి తీసుకుని రేవంత్ రెడ్డి పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. సీఎం పీఠం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు చివరి వరకు కృషి చేశారు. కానీ, హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించింది. 
 
కల్వకుంట్ల పాలనను కూలదోసిన ప్రజలకు ధన్యవాదాలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
 
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను కూలదోసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా ఆయన అభిననందలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"సీఎల్పీ నేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి సోదరుడికి అభినందనలు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు" అంటూ వెంకటరెడ్డి ట్వీట్ చేశారు. గతంలో ఇద్దరూ ఒకే వేదికపై ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా 'ఎక్స్' వేదికగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
 
కాగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలను రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించిన సమయంలో రేవంత్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం వారి మధ్య సయోధ్య కుదిర్చడంతో ఎన్నికల్లో వారిద్దరూ కలిసి పని చేశారు. 
 
కోల్‌కతా యువకుడిని పెళ్లాడేందుకు భారత్ వచ్చిన పాకిస్థాన్ యువతి.. 
 
తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకునేందుకు ఓ పాకిస్థాన్ యువతి భారత్‌కు వచ్చింది. కోల్‌కతాకు చెందిన యువకుడిని వివాహం చేసుకునేందుకు ఆమె భారత్‌కు వచ్చారు. పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి చెందిన జవేరియా ఖానుమ్.. వాఘా-అట్టారి అంతర్జాతీయ సరిహద్దులో మంగళవారం భారత్‌లో అడుగుపెట్టింది. ఆమెకు కాబోయే భర్త సమీర్ ఖాన్, అతడి కుటుంబ సభ్యులు ఖానుమ్‌కు ఘనస్వాగతం పలికారు. వాయిద్యాలతో భారత్‌లోకి ఆహ్వానించారు. వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది జనవరిలో నిశ్చయమైంది. 
 
45 రోజుల వీసాపై ఖానుమ్ భారత్‌లో అడుగుపెట్టింది. గతంలో రెండు సార్లు వీసా తిరస్కరణకు గురైందని, అదృష్టం కొద్ది మూడోసారి వీసా మంజూరైందని ఆమె మీడియాకి తెలిపింది. కొవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా ఐదేళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు భారత్‌లోకి ప్రవేశించాక కొద్దిసేపు మీడియాతో ఆమె మాట్లాడింది. వచ్చే నెల జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది.
 
భారత్ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడకు వచ్చిన వెంటనే చాలా ప్రేమ, ఆప్యాయతలు లభిస్తున్నాయని ఖానుమ్ చెప్పింది. 'సంతోషకరమైన ముగింపు, ఆనందకరమైన ఆరంభం' అంటూ పెళ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌లోని తన ఇంటి వద్ద అందరూ చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత వీసా మంజూరు కావడాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొంది.
 
కాగా తన తల్లి మొబైల్లో ఖానుమ్ ఫొటో చూశానని ఖాన్ చెప్పాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు అమ్మతో చెప్పానని వెల్లడించాడు. ఈ కథ 2018లో ప్రారంభమైందని వెల్లడించాడు. చదువు అనంతరం జర్మనీ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ ఫోనులో ఆమె ఫోటో చూశానని వివరించాడు. వీసా మంజూరు చేసిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. మీడియాతో మాట్లాడిన అనంతరం దంపతులు అమృతసర్ నుంచి కోల్‌కతాకు బయలుదేరి వెళ్లారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుఫాను తీరం దాటినప్పటికీ.. నేడు కూడా వర్షాలే.. వర్షాలు