Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ నగరంలో లిక్కర్ చాక్లెట్స్....

హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న లిక్కర్ చాక్లెట్ట గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఈ లిక్కర్ చాక్లెట్లను ఓ మాఫియా ముఠా తయారు చేసి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో హైద

హైదరాబాద్ నగరంలో లిక్కర్ చాక్లెట్స్....
, సోమవారం, 16 జులై 2018 (11:58 IST)
హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న లిక్కర్ చాక్లెట్ట గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఈ లిక్కర్ చాక్లెట్లను ఓ మాఫియా ముఠా తయారు చేసి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో హైదరాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా పెట్టి.. ఈ చాక్లెట్ల గుట్టును బహిర్గతం చేశారు.
 
నిజానికి లిక్కర్ చాక్లెట్లపై మన దేశంలో నిషేధం ఉన్నా అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా లిక్కర్‌ చాక్లెట్లను డెన్మార్క్‌ నుంచి అక్రమంగా తెప్పించి మెట్రోపాలిటన్‌ నగరాల్లో విక్రయిస్తోంది. ఇందుకోసం నగరానికి చెందిన ఓ చాక్లెట్‌ డిస్ట్రిబ్యూటర్‌ ముఠాతో ఒప్పందం కుదుర్చుకునిమరీ అమ్ముతోంది. 
 
అధికారుల తనిఖీల్లో లండన్, ఐరిస్, డెన్మార్క్‌కు చెందిన మొత్తం 96 బాక్సుల్లో ఉన్న 1,081 చాక్లెట్లను అధికారి నంద్యాల అంజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్‌లో 4 శాతం ఆల్కహాల్‌ ఉన్నట్లు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువే : రేఖాశర్మ