Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బలహీనమైన వారు స్త్రీలు అనే మూస భావనలను బద్దలు కొట్టే కథను దక్షిణాది ప్రేక్షకులు మెచ్చుకుంటారు

image

ఐవీఆర్

, మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (22:57 IST)
అశోక్ పటోలే యొక్క క్లాసిక్ నాటకం 'మా రిటైర్ హోతీ హై' ఒక మహోన్నత  సాంఘిక నాటకం, ఇది స్త్రీలను గృహ విధులకు మాత్రమే ఎందుకు చేయాలి, వారి కుటుంబాలకు నిరంతరాయంగా సేవ చేయాలనే ఉద్దేశ్యం గురించి అడుగుతుంది. జీ థియేటర్ టెలిప్లే ఇప్పుడు కన్నడ, తెలుగులోకి దీనిని అనువదించబడినది. ఈ టెలిప్లేలో నటించిన యతిన్ కార్యేకర్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ ప్లే విస్తృత ఆదరణ పొందుతుందని  అభిప్రాయపడ్డారు.
 
ఆయన మాట్లాడుతూ,"ఈ కథను దక్షిణాది ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎందుకంటే ఇది బలహీనమైన, సౌమ్యమైన, మానసికంగా ఆధారపడిన తల్లి యొక్క మూస పద్ధతిని ఛేదిస్తుంది. మహిళలు తమ కోసం తాము నిలబడేలా ప్రోత్సహిస్తుంది. ఈ నాటకాన్ని కన్నడ, తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను" అని అన్నారు 
 
ఈ టెలిప్లేలో, యతిన్ యొక్క సహనటి దివంగత రీమా లాగూ తన కుటుంబానికి గుణపాఠం చెప్పడానికి ఇంటి కష్టాల నుండి 'రిటైర్' కావాలని నిర్ణయించుకునే తల్లి పాత్రలో నటించారు. నాటకం యొక్క సందేశాన్ని అనేక భాషల్లోకి అనువదించాలని యతిన్ భావిస్తూ, "నిజానికి, చాలా కాలంగా స్త్రీలకు తగిన గుర్తింపు ఇవ్వబడలేదు. వారు గృహ పాత్రలకే పరిమితమయ్యారు. ఈ నాటకం చాలా భిన్నమైన దృక్పథాన్ని అందిస్తుంది. ఒక తల్లి పదవీ విరమణ ఎంచుకుంటే ఏమి జరుగుతుందని అడుగుతుంది?" అని చెప్పారు.  
 
సుమన్ ముఖోపాధ్యాయ నిర్మాణంలో రంగస్థలానికి రాజన్ తమ్హానే దర్శకత్వం వహించబడిన 'మా రిటైర్ హోతీ హై'లో సచిన్ దేశ్‌పాండే, శ్వేతా మెహెందాలే, సంకేత్ ఫాటక్, మాన్సీ నాయక్, రుతుజా నాగ్వేకర్ కూడా నటించారు. ఏప్రిల్ 27 నుంచి  టాటా ప్లే థియేటర్‌లో దీన్ని చూడవచ్చు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం టైటిల్ గా కూలీ