Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డీటీహెచ్ ఆఫరింగ్‌గా భారతీయ టీవీ తెరలపైకి జిందగీ

Zindagi
, సోమవారం, 23 మే 2022 (17:55 IST)
మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిన కథలను జిందగీ అందించింది. దేశవిదేశాలకు చెందిన నటులు మన గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఈ సంచలనాత్మక చానల్ ఇప్పుడు వాల్యూ యాడెడ్ సర్వీస్‌గా డీటీహెచ్ ప్లాట్ ఫామ్స్ పై అందుబాటులోకి రానుంది. ప్రఖ్యాతిగాంచిన జిందగీ గుల్జార్ హైతో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దేశానికి చెందిన ఒక తరం అంతా కూడా ఈ షోతో ప్రేమలో పడింది. దేశవ్యాప్తంగా వీక్షకుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మారుతూ వస్తున్న జిందగీ ఈ రోజు నుంచి మన ఇళ్లలోకి, మన గుండెల్లోకి టాటా ప్లే, డిష్ టీవీ, డి2హెచ్‌ల ద్వారా రానుంది.

 
కుటుంబాలను కలసిఉండేలా చేస్తానన్న తన వాగ్దానాన్ని ఇది నిజమైన, అందమైన, శక్తివంతమైన కథలతో కొనసాగిస్తోంది. అంతా ఎంతగానో ఇష్టపడిన, అభిమానించిన కిత్ని గిర్హేన్ బాకీ హై కిరణ్ ఖేర్ వ్యాఖ్యానంతో రానుంది. అదే విధంగా అన్ జారా, సాద్ కే తుమ్ హారే, అంతా ఎంతగానో మాట్లాడుకునే మిసెస్ అండ్ మిస్టర్ శమీమ్, ఇంకా మరెన్నో వరుసలో ఉన్నాయి. నేటి కాలపు వీక్షకుల అవసరాలను తీర్చడం వీటి లక్ష్యం. జిందగీ ఆవిష్కరణకు రెండు ఎపిసోడ్స్‌ను బ్యాక్ టు బ్యాక్ ప్రసారం చే యడం అనే వినూత్న కంటెంట్ వ్యూహం అండగా ఉండనుంది.

 
ఫిక్షన్ షోలను ప్రసారం చేయడంతో పాటుగా, తాప్సీ పన్ను, అమిత్ సాద్ నటించిన, తిగ్ మాంశు దులియా దర్శకత్వం వ హించిన బారిష్ ఔర్ చౌమే; సాదత్ హసన్ మాంటో షార్ట్ స్టోరీ ఆధారంగా రూపుదిద్దుకున్న, పంకజ్ కపూర్ లాంటి వారు నటించిన, కేతన్ మెహతా దర్శకత్వం వహించిన టోబా టేక్ సింగ్; ఫరాజ్ ఆరిఫ్ అన్సారీ రచించిన. తనూజా చంద్ర దర్శకత్వం వహించిన, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రలో నటించిన సిల్వత్; జాతీయ పురస్కార గ్రహీత అపర్ణా సేన్ దర్శకత్వం వహించిన, కొంకణ సేన్ శర్మ వంటి వారు నటించిన సారీ రాత్ వంటి ఎంతగానో ప్రశంసలు పొందిన సినిమాలను కూడా ప్రసారం చేయనుంది.

 
ఈ సందర్భంగా జీ స్పెషల్ ప్రాజెక్ట్స్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ శైలజ కేజ్రివాల్ మాట్లాడుతూ, ‘‘ఇది మాకెంతో గర్వించదగిన సంద ర్భం. మేం మరో మైలు రాయిని చేరుకున్నాం. ముఖ్యమైన డీటీహెచ్ వేదికలపై జిందగీని ఆవిష్కరిస్తున్నాం. దేశవిదేశాలకు చెందిన సంస్కృతులు కలసి పని చేయడాన్ని విశ్వసించే కొద్దిమంది వ్యక్తుల మధ్య మొదలైన ఒక నిశ్శబ్దపు ఆలోచన దేశంలో అంతా ఎంతగానో అభిమానించే టీవీ చానల్స్ లో ఒకటిగా ఎదిగింది. దేశంలో డిజిటల్ వినియోగపు అవసరాలను ఓటీటీ తీర్చడాని కంటే ముందుగానే జిందగీ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది మరింత ఎదగనుంది. జిందగీని ఇప్పుడు దేశం లోని ప్రతీ మూలకూ చేర్చడంతో ఇప్పుడు టాటా ప్లే, డిష్ టీవీ, డీ2హెచ్ లలో నేడు మేం నూతన భాగస్వాములను చేర్చుకున్నాం’’ అని అన్నారు.

 
టాటా ప్లే చీఫ్ కంటెంట్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ పల్లవి పురి ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, ‘‘దేశంలో చక్కటి కథలకు, రచయితలు వెన్నంటి ఉండే స్టోరీలైన్స్‌కు భారీగా డిమాండ్ ఉంది. టాటా ప్లే జిందగీ కంటెంట్ లైబ్రరీ జీవితానికి అద్దం పట్టేదిగా ఉంటుంది. అవి మన జీవితాల్లోంచి వచ్చిన కథలు. వీక్షకులకు అవి తమకు సంబంధించిన కథలుగా వేడుక చేస్తాయని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

 
ఈ సందర్భంగా డిష్ టీవీ ఇండియా లిమిటెడ్ హెడ్ శ్రీమతి శృతి కుమార్ మాట్లాడుతూ, ‘‘మా చందాదారులతో అనుసంధానమయ్యేందుకు సాపేక్షంగా ఉండే, విశిష్టమైన, విభిన్నమైన కంటెంట్ అత్యంత ప్రభావపూరితమైన మార్గమని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం. మా సమగ్ర వాల్యూ యాడెడ్ సర్వీస్ పోర్ట్ ఫోలియోకు తాజా జోడింపుగా జిందగీ యాక్టివ్ ను ప్రకటించేందుకు మేం ఎంతో ఆనందిస్తున్నాం.


మా సబ్ స్క్రైబర్లకు మేం భావోద్వేగపూరత, ఆనందింపజేసే కథలు, కుటుంబసభ్యులతో, సన్నిహితులతో కలసి ఆనందించే సిరీస్, సినిమాలు అందిస్తాం. మన దేశానికి వెలుపల ఇదే విధమైన విలువలు, సంస్కృతు లు, సంప్రదాయాలు కలిగిఉన్న ప్రజలను/సమూహాలను ఒక్కచోటుకి తీసుకురాగలుగుతామని మేం విశ్వసిస్తున్నాం. మా యాక్టివ్ సర్వీసెస్ మా సబ్ స్క్రైబర్లకు అత్యంతగా నచ్చే, వారు మెచ్చే కంటెంట్ ను అందిస్తుంది. జిందగీ యాక్టివ్‌కు ఈ తాజా జోడింపు మా సేవల పట్ల మా కట్టుబాటును పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంటే సుందరానికిలో రంగో రంగా అంటోన్న నాని