Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడితో అక్రమ సంబంధం.. అనంతలో కలకలం.. ప్రాణాల మీదకు?

సోదరుడితో అక్రమ సంబంధం వ్యవహారం అనంతపురంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. అనంత శివారులోని ఆదర్శనగర్‌లో రామాంజనేయులు, యాస్మిన్‌ దంపతులు ఉన్నారు. రామాంజనేయులకి దగ్గరి బంధువు శ్రీనివాసులు కూడా తన భా

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (15:22 IST)
సోదరుడితో అక్రమ సంబంధం వ్యవహారం అనంతపురంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. అనంత శివారులోని ఆదర్శనగర్‌లో రామాంజనేయులు, యాస్మిన్‌ దంపతులు ఉన్నారు. రామాంజనేయులకి దగ్గరి బంధువు శ్రీనివాసులు కూడా తన భార్య బిడ్డలతో అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. శ్రీనివాసులు యాస్మిన్‌కి తమ్ముడి వరస అవుతాడు. 
 
కానీ ఈ విషయాన్ని మరిచి శ్రీనివాసులు యాస్మిన్‌తో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియరావడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో వీరిద్దరూ గత కొంత కాలంగా దూరంగా వుంటున్నారు. శ్రీనివాసులు గురువారం యాస్మిన్‌కు ఫోన్‌చేసి మాట్లాడాలని పిలవడంతో ఆమె అ తడి దగ్గరకు వచ్చింది. 
 
అక్కడి నుంచి అనంతపురం రూరల్‌ మండలం కాట్నేకాలువ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తనతో సంబంధం కొనసాగించాలంటూ కోరడంతో ఇరువురిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రీనివాసులు వెంటతెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమె గొంతుపై కోసి, తలపై రాయితో మోదాడు. అతని నుంచి తప్పించుకుని ఆమె రోడ్డుపైకివచ్చి భర్తకు ఫోన్‌ద్వారా సమాచారం అందించి పరారై రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కానీ శ్రీనివాసులు కూడా తనకుతానే బ్లేడ్‌తో మణికట్టును కోసుకుని, విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసులు, యాస్మిన్‌ను వేర్వేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments