జాతకం


మేషం
మేషం: శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది.
రాశిచక్ర అంచనాలు

వృషభం
వృషభం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనం బాగా వ్యయం చేసి అయిన వారిని సంతృప్తి పరుస్తారు. చిట్క్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికం. స్థిరాస్తిని అమ్మటానికై చేయు ప్రయత్నంలో పునరాలోచన మంచిది. స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
రాశిచక్ర అంచనాలు

మిథునం
మిధునం: దీర్ఘకాలిక పెట్టుబడులు, నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలు త్వరలోనే అనుకూలిస్తాయి. భాగస్వామ్యుల మధ్య అనవసరపు విషయాలు చర్చకు రావడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
రాశిచక్ర అంచనాలు

కర్కాటకం
కర్కాటకం: కుటుంబ, ఆర్థిక పరిస్థితులు మెరుగుగా ఉంటాయి. ఎంతటి చిక్కు సమస్యనైనా తేలికంగా పరిష్కరిస్తారు అసాధ్యమనుకున్న దానిని సాధించి మీ సత్తా చాటుకుంటారు. మీ శ్రమకు తగిన పారతోషకం లభిస్తుంది. మీ సంతానం విషయంలో మెళకువ అవసరం. స్త్రీలు షాపింగ్ కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
రాశిచక్ర అంచనాలు

సింహం
సింహం: పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. రవాణా రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు వంటివి ఎదుర్కుంటారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
రాశిచక్ర అంచనాలు

కన్య
కన్య: ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వాయిదా పడుతాయి. ముఖ్యమైన విషయాలలో చురుకుదనం కానవస్తుంది. ముఖ్యమైన వస్తువులు అమర్చుకుంటారు.
రాశిచక్ర అంచనాలు

తుల
తుల: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తి మిమ్మల్ని వెన్నంటుతుంది. స్త్రీలకు టి.వి., ఛానెళ్ళ నుండి ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో చర్చలు, వినోదాల్లో పాల్గొంటారు. హామీలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం.
రాశిచక్ర అంచనాలు

వృశ్చికం
వృశ్చికం: రాజకీయాలలో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. స్త్రీలకు ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు వలన రుణయత్నాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు. కాంట్రాక్టర్లకు మత్స్య, కోళ్ల, గొఱ్ఱెల వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
రాశిచక్ర అంచనాలు

ధనస్సు
ధనస్సు: భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఓర్పు, మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. దైవా, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
రాశిచక్ర అంచనాలు

మకరం
మకరం: స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. ఏదైనా స్థిరాస్తి అమ్మకం వాయిదాపడడం మంచిది. మెుండి బాకీలు సైతం వసూలవుకాగలవు. నూతన పెట్టుబడుల విషయంలో మెళకువ అవసరం. నిరుద్యోగులు నిరాశకు లోనవుతారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి.
రాశిచక్ర అంచనాలు

కుంభం
కుంభం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది.
రాశిచక్ర అంచనాలు

మీనం
మీనం: కుటుంబంలోను, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. పాత మిత్రుల కలయిక మీలో సంతోషం వెల్లువిరుస్తుంది. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. ముఖ్యమైన పనులలో ఏకాగ్రత వహిస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.
రాశిచక్ర అంచనాలు