Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు దిగనున్న డీఎస్.. హస్తంతో మళ్లీ దోస్తీ...

తెలంగాణ రాష్ట్ర సమితికి ఎంపీ డీఎస్ గుడ్ బై చెప్పేయనున్నట్లు తెలుస్తోంది. తనంతట తానుగా టీఆర్ఎస్‌కి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని పార్టీ అధిష్ఠానికి డీఎస్ తేల్

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (15:21 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి ఎంపీ డీఎస్ గుడ్ బై చెప్పేయనున్నట్లు తెలుస్తోంది. తనంతట తానుగా టీఆర్ఎస్‌కి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని పార్టీ అధిష్ఠానికి డీఎస్ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ..  మాట్లాడుతూ, నోరుమూసుకుని డీఎస్ రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. 
 
ఎంపీ కవితను తన కొడుకు విమర్శిస్తే ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. డీఎస్ లాంటి వ్యక్తి పార్టీలో ఉండటం మంచిది కాదని పేర్కొంటూ, కలిసికట్టుగా తాము తీర్మానం చేసిన విషయాన్ని బాజిరెడ్డి ప్రస్తావించారు. ఇలా తీర్మానం చేయడాన్ని అగౌరవంగా భావించని డీఎస్, సిగ్గులేకుండా పార్టీలో కొనసాగుతానని అధిష్ఠానానికి లేఖ రాయడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఎస్‌కు ఏమాత్రం సిగ్గూలజ్జా ఉన్నా తక్షణం పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బాజిరెడ్డి డిమాండ్ చేశారు.
 
ఈ నేపథ్యంలో తెరాసను వీడేందుకు డీఎస్ రంగం సిద్ధం చేసినట్లు సన్నిహితులు అంటున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను డీఎస్ కలవనున్నారని.. ఆయన చేరికకు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఈ నెల 11న సోనియా, రాహుల్‌ సమక్షంలో ఎమ్మెల్సీ భూపతి రెడ్డితో పాటు డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని టాక్ వస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం డీఎస్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్ వస్తే పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments