Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయల రసాలతో ఆరోగ్య ప్రయోజనం అపారం!

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (15:55 IST)
ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూరగాయల్ని, పండ్లని మించినవి లేవన్న సంగతి మనకు తెలిసిందే. కానీ అలాంటి వాటిలో కొన్ని కూరగాయలు మనకు ఎంతో మేలును చేకూరుస్తాయి. వాటితో చేసిన జ్యూస్‌లు తీసుకుంటే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది....
 
బీట్‌రూట్‌: తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్‌రూట్‌ రసం తాగడం మంచిది. కనీసం రెండు మూడు రోజులకోకసారైనా గ్లాసుడు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే చాలని అంటున్నారు నిపుణులు. దీన్ని తాగడం వల్ల శరీరానికి చక్కెర సమపాళ్లలో అంది నీరసం దరిచేరదు. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. విటమిన్‌ బి, సి పుష్కలంగా ఉన్న బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తుంది.
 
పుచ్చకాయ : మనిషికి కావాల్సిన ఖనిజాలు, ఇతర పోషకాలు.. ఒక గ్లాసుడు పుచ్చకాయ రసం తాగితే అందుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. డీహైడ్రేషన్‌ సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలనూ బయటకు పంపుతుంది. 
 
టమాటా జ్యూస్: టమాటా జ్యూస్‌లో శరీరంలోని కొవ్వుని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. సన్నబడాలి అనుకుంటే ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి ఉండటం వల్ల చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.
 
కాకరకాయ : కాకర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేదు. ఈ పేరు వినగానే ఆమడదూరం పరిగెడతారు కూడా చాలా మంది. కానీ ఇది శరీరానికి చేసే మేలు ఎంతో. ఇందులో షుగర్‌ ఉండదు కాబట్టి మధుమేహ రోగులకు ఈ జ్యూస్‌ ఎంతో మంచిది.
 
క్యారెట్‌ : విటమిన్‌ 'ఎ' సమృద్ధిగా ఉండే కూరగాయ ఇది. చర్మ సమస్యలు, కళ్ల సమస్యలు ఉన్నవాళ్లు క్యారెట్‌ జ్యూస్‌ తాగితే ఉపశమనం కలుగుతుంది. రోజూ ఒక గ్లాస్ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే చాలు... చర్మం మిలమిల మెరిసిపోతుంది. 
 
పాలకూర జ్యూస్ : పాలకూర ఎండాకాలంలో మనకి చాలా మేలు చేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఈ పాలకూర తినటం వల్ల ఎర్ర రక్త కణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఈ పాలకూర జ్యూస్ వాసన నచ్చక తాగలేని వాళ్ళు ఇందులో ఒక కేరట్, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగచ్చు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments