Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి వస్తావా అంటూ.. మహిళా జర్నలిస్టును కన్నుకొట్టి వేధించిన లాయర్...

సుప్రీంకోర్టు సాక్షిగా ఓ మహిళా జర్నలిస్టును న్యాయవాది ఒకరు లైంగికంగా వేధించాడు. ఒక్కసారి వస్తావా అంటూ కన్నుకొట్టి మరీ వేధించడంతో ఆ మహిళా జర్నలిస్టు తగిన బుద్ధి చెప్పింది. అలాగే, పోలీసులకు ఫిర్యాదు చేయ

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (13:15 IST)
సుప్రీంకోర్టు సాక్షిగా ఓ మహిళా జర్నలిస్టును న్యాయవాది ఒకరు లైంగికంగా వేధించాడు. ఒక్కసారి వస్తావా అంటూ కన్నుకొట్టి మరీ వేధించడంతో ఆ మహిళా జర్నలిస్టు తగిన బుద్ధి చెప్పింది. అలాగే, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆ కీచక లాయర్‌ను అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జూలై 12న సుప్రీంకోర్టు బయట, జూలై 27న కోర్టు లోపల న్యాయవాది తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు జర్నలిస్టును లైంగికంగా వేధించిన లాయర్‌ను ఢిల్లీ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడు తనను రెండుసార్లు వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలు తెలిపింది. 
 
కాగా, సుప్రీకోర్టులో మహిళలపై వేధింపులు జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. నెల రోజుల క్రితం లా క్లర్క్ ఒకాయన తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ యువ మహిళా లాయర్ ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం