Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌లో వరుస హత్యలు... హంతకుడెవరో తెలుసా

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక థ్రిల్లింగ్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఒకరు హంతకుడు, మరొకరు పోలీస్, డిటెక్టివ్, మిగిలినవారంతా సాధారణ ప్రజలు. హంతకుడు ప్రజలను చంపుతుండాలి, సామాన్య ప్రజలు తమ ప్

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (12:28 IST)
నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక థ్రిల్లింగ్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఒకరు హంతకుడు, మరొకరు పోలీస్, డిటెక్టివ్, మిగిలినవారంతా సాధారణ ప్రజలు. హంతకుడు ప్రజలను చంపుతుండాలి, సామాన్య ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండాలి, ఇక పోలీస్ మరియు డిటెక్టివ్ హంతుకుడెవరో ఆధారాలతో సహా పట్టుకోవాలి.
 
ఈ టాస్క్ గెలుపోటములు నామినేషన్స్‌పై ప్రభావం చూపుతాయని బిగ్ బాస్ చెప్పగా ఈ టాస్క్‌కి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గీతా మాధురి హంతకుడిగా, రోల్ రైడా పోలీస్‌గా మరియు గణేష్ డిటెక్టివ్‌గా ఎంపికవగా మిగిలిన వారంతా ప్రజలుగా ఉన్నారు. కానీ హంతకుడెవరో ఇంటి సభ్యులకు తెలియదు.
 
బిగ్ బాస్ ఆదేశాలను అనుసరిస్తూ గీత ఒక్కొక్కరినీ మట్టుబెడుతూ వచ్చింది. మొదటిగా శ్యామల హత్యకు గురవగా, తర్వాత కౌషల్ హత్యకు గురయ్యారు. వారిద్దరికీ సంతాపం తెలియజేసి, అక్కడే ఏర్పాటు చేసిన స్మశానానికి పంపారు. రోల్ మరియు గణేష్ ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా ఇంటరాగేట్ చేస్తూ అనుమానం ఉన్న వ్యక్తుల వివరాలను తెలుసుకుంటున్నారు.
 
హౌస్‌మేట్స్‌లో చాలా మంది అమిత్, సామ్రాట్‌పై అనుమానం వ్యక్తం చేశారు. గీతా మిగతా అందరనీ సక్సెస్‌ఫుల్‌గా మర్డర్ చేస్తుందా, రోల్ మరియు గణేష్ హంతకులను ఆధారాలరో పట్టుకోగలరా అనేవి రేపటి ఎపిసోడ్‌లో ప్రసారమవుతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments