Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీకి కొత్త పాఠం నేర్పిన 'గీత గోవిందం' సక్సెక్

తెలుగు చిత్ర పరిశ్రమల పెద్దలకు 'గీత గోవిందం' చిత్రం సరికొత్త గుణపాఠం నేర్పింది. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (12:52 IST)
తెలుగు చిత్ర పరిశ్రమల పెద్దలకు 'గీత గోవిందం' చిత్రం సరికొత్త గుణపాఠం నేర్పింది. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీవాసు నిర్మించాడు.
 
ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్‌ సాధించింది. పైగా, ఎక్కడ చూసినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు, అటు ఓవర్సీస్, మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తోంది. దీంతో ఈ చిత్రం సాధించిన వసూళ్ల గురించి ట్రేడ్ గొప్పగా చెబుతోంది. ఇదో రియల్ జెన్యూన్ విజయమంటూ కితాబిస్తోంది. 
 
పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కి రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సంచలన చిత్రంగా 'గీత గోవిందం' గురించి మార్కెట్ విశ్లేషకులు గొప్పగా చెబుతున్నారు. ఇది మరో సైరాఠ్ తరహా విజయం అనడంలో సందేహమే లేదని వారంటున్నారు. చెన్నైలో అయితే ఈ చిత్రం ఏకంగా రూ.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. అదీ కూడా కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే. 
 
కనీసం డబ్బింగ్ చేసి కూడా రిలీజ్ చేయలేదు. అయినా ఇంత పెద్ద హిట్టయ్యిందంటే మంచి సినిమాని ఆదరించేందుకు ప్రేక్షక జనం ఎప్పుడూ ముందుంటారని మరోమారు రుజువు చేశారు ప్రేక్షకులు. చిత్రం బాగుంటే నటీనటులతో సంబంధం లేకుండా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని తేలింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments