Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్లుగా మహిళా హెడ్ కానిస్టేబుల్‌‌పై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం...

దేశంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోతోంది. హర్యానా రాష్ట్రంలో ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై మరో హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా ఏకంగా నాలుగేళ్ళుగా ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు.

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (17:26 IST)
దేశంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోతోంది. హర్యానా రాష్ట్రంలో ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై మరో హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా ఏకంగా నాలుగేళ్ళుగా ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈక్రమంలో ఓ రోజు రాత్రి మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనతో సన్నిహితంగా ఉండే ఫోటోలు చూపిస్తూ బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేయసాగాడు. ఇలా నాలుగేళ్లుగా అత్యాచారం చేయసాగాడు. అతని లైంగిక వేధింపులు భరించలేని ఆమె పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. 
 
దీనిపై మహిళా బాధితురాలు స్పందిస్తూ, ప్రధాన నిందితుడు జోగీందర్‌ అలియాస్‌ మింటూతో పల్వాల్‌ జిల్లా అల్వార్‌పూర్‌లో 2014లో తనకు తొలిసారి పరిచయమయ్యారని బాధితురాలు వెల్లడించారు. ఫరీదాబాద్‌, జింద్‌, పల్వాల్‌లో పనిచేస్తుండగా జోగీందర్‌ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. జూన్‌ 2017లో నిందితుడి సోదరుడు కూడా అత్యాచారం చేసినట్టు పేర్కొంది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ వసీం అక్రమ్ స్పందిస్తూ, మహిళా హెడ్ కానిస్టేబుల్ చేసిన ఆరోపణలపై లైంగిక దాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, అయితే, పోలీస్‌ స్టేషన్‌లోనే లైంగిక దాడి జరిగిందన్న మీడియా కథనాలు అవాస్తమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం