రెండు రోజులు గడిపితే ఆ ఫోటోలు డిలీట్ చేస్తా : మోడల్‌కు టార్చర్

ఓ కామాంధుడుకి ఓ మోడల్ చుక్కలు చూపింది. ఆ పోకిరి వద్ద ఉన్న ఫోటోలను డిలీట్ చేసేందుకు ఒక్కరాత్రి తనతో గడపాలంటూ మోడల్‌కు షరతు విధించాడు. ఈ షరతుకు అంగీకరించిన ఆ మోడల్.. చివరకు కామాంధుడిని జైలు ఊచలు లెక్కిం

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (17:55 IST)
ఓ కామాంధుడుకి ఓ మోడల్ చుక్కలు చూపింది. ఆ పోకిరి వద్ద ఉన్న ఫోటోలను డిలీట్ చేసేందుకు ఒక్కరాత్రి తనతో గడపాలంటూ మోడల్‌కు షరతు విధించాడు. ఈ షరతుకు అంగీకరించిన ఆ మోడల్.. చివరకు కామాంధుడిని జైలు ఊచలు లెక్కించేలా చేసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాకు చెందిన షకీర్ హుస్సేన్ అనే యువకుడు పలువురు మోడల్ ఫొటోలతో నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో షేర్ చేశాడు. 
 
అంతేకాదు, ఆమెకు వాటిని పంపుతూ వేధించసాగాడు. తనతో రెండు రోజులు గడిపితే వాటిని డిలీట్ చేస్తానని షరతు విధించాడు. ఈ విషయమై బాధితురాలు పలుమార్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
 
ఇక లాభం లేదనుకుని మోడల్ తానే స్వయంగా రంగంలోకి దిగింది. తన భర్తతో కలిసి ఢిల్లీ నుంచి 900 కిలోమీటర్లు రైలులో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా చేరుకుంది. స్థానిక పోలీసులను కలిసి విషయం చెప్పింది. వారు ఆమెకు అండగా నిలిచారు. 
 
అక్కడి నుంచి ఆమె నిందితుడికి ఫోన్ చేసి తాను ఖండ్వా వచ్చినట్టు చెప్పింది. దీంతో ఆమెను కలుసుకునేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన పలుకుబడి ఉపయోగించి అరెస్టు చేసిన గంటలోనే బెయిలుపై విడుదలయ్యాడు. 
 
ఆ తర్వాత మోడల్‌కు ఫోన్ చేసి మళ్లీ బెదిరించాడు. దీంతో మోడల్ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దఫా కాస్త గట్టి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు... షకీర్‌ను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. 

విడాకులిచ్చి వేరే యువతిని పెళ్లాడిన భర్త.... వధువుపై గ్యాంగ్ రేప్ చేయించిన మాజీ భార్య

ముఖ్యమంత్రైనా రావాల్సిందే.. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదు : ధర్మాబాద్ కోర్టు

క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. కాదంటే నరకమే...

టెన్ష‌న్ టెన్ష‌న్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..! ఎందుకు?

ఆఫర్ల కోసం అందాల భామ తేజస్విని... బిగ్ బాస్‌లో అలా అయింది..

సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

రోడ్డుపై నిల్చుని యువతుల చేతుల్ని తాకుతూ వేధించిన పోలీస్

క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. కాదంటే నరకమే...

తర్వాతి కథనం