మహిళలు హనుమంతుడి పాదాలను తాకకూడదా?

హనుమంతుడు చిరంజీవి. శ్రీ కృష్ణునిచే ఉపదేశించబడిన పవిత్ర భగవద్గీతను వినిన నలుగురిలో హనుమంతుడు ఒకరు. అలాగే శ్రీకృష్ణుడిని విశ్వరూపాన్ని దర్శించుకున్న వారిలోనూ హనుమంతుడున్నాడు. శ్రీకృష్ణ విశ్వరూపాన్ని అర

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:22 IST)
హనుమంతుడు చిరంజీవి. శ్రీ కృష్ణునిచే ఉపదేశించబడిన పవిత్ర భగవద్గీతను వినిన నలుగురిలో హనుమంతుడు ఒకరు. అలాగే శ్రీకృష్ణుడిని విశ్వరూపాన్ని దర్శించుకున్న వారిలోనూ హనుమంతుడున్నాడు. శ్రీకృష్ణ విశ్వరూపాన్ని అర్జునుడు, సంజయుడు, బార్బరికా (ఘటోత్కచుడి కుమారుడు)లతో పాటు హనుమంతుడు కూడా దర్శించుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
అలాంటి మహిమాన్వితుడైన హనుమంతుని పాదాలను మహిళలు స్పృశించరాదు. ఆయన బ్రహ్మచారి కావడంతో మహిళలు హనుమాన్ శిల్పాలను, శిలలను తాకడం చేయకూడదు. హనుమంతుని విగ్రహాలను తాకుండా మహిళలు పూజ చేసుకోవచ్చు. కానీ పురుషులకు ఆ నియమం లేదు. 
 
అలాగే హనుమంతునికి రాసే సింధూరాన్ని కూడా మహిళలు శుచిగా వున్నప్పుడే నుదుట ధరించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. పంచామృతం, తులసీ దళాలతో పూజ చేసినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.
 
హనుమంతుడు ఎందుకు నమస్కరిస్తూనే వుంటాడంటే?
రావణ వధ పూర్తయ్యాక సీతారాములు వెళ్ళిపోతూ ఆంజనేయునితో వరం కోరుకోమంటారు. అప్పుడు హనుమంతుడు తనకు మరే విధమైన కోరికలు వద్దు. ఏ రూపం చూసినా అందులో మీ రూపమే కనిపించేలాగ, ఏ శబ్ధం వినిపించినా అందులో సీతారాముల కథ వినిపించేలా, ఎక్కడ నమస్కరించినా అది మీకే చెందేలా వుండే ఈ భావం నాకు శాశ్వతంగా వుండేలా అనుగ్రహించు అని కోరుకున్నాడు. దానికి రాముడు సరే అన్నాడు. 
 
అందుకే ఆంజనేయుని నమస్కారం సీతారాములకే చెందుతుంది. అంతేగాకుండా సీతారాములకు నమస్కరిస్తున్న హనుమకి నమస్కరించడం ఆ సీతారాములకీ మరింత ఇష్టం. ఎందుకంటే.. భగవంతుడు తనకు భక్తుడు చేసే నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత మిస్తాడు కాబట్టి.

మంచం మీద కూర్చుని భోజనం చేస్తే వచ్చే ఫలితాలు తెలిస్తే షాకే..?

దసరా రోజు ఇవి పాటిస్తే మీరు కుబేరులే...

స్త్రీలకు లజ్జ, వినమ్రతలే భూషణములు... పెద్దల సూక్తులు...

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

భారత్-హాంకాంగ్ మ్యాచ్‌లో జనసేన జెండా

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

వైసీపీలో వంగవీటి ముసలం... రాధా పార్టీ మారతారా?

నా నిద్ర.. నా ఇష్టం... అంటే ఇప్పటి కాలంలో కుదర్దండీ... దానికీ ఓ లెక్కుంది...

కలబందతో బరువు తగ్గొచ్చు... ఇలా చేస్తే...

సహజరతి కంటే ముఖరతి తృప్తినిస్తోంది.. ఎందుకని?

తర్వాతి కథనం