శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదట..

శ్రావణ మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైన మాసమని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో పూజలు చేసేవారికి ఈశ్వరానుగ్రహం లభిస్తుందని వారు చెప్తున్నారు. అంతేగాకుండా.. పరమేశ్వరుడే స్వయంగా శ్రావణ మాసం తనకు ప్రీత

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:00 IST)
శ్రావణ మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైన మాసమని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో పూజలు చేసేవారికి ఈశ్వరానుగ్రహం లభిస్తుందని వారు చెప్తున్నారు. అంతేగాకుండా.. పరమేశ్వరుడే స్వయంగా శ్రావణ మాసం తనకు ప్రీతికరమని చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో తనను పూజించే వారి కోరికలు నెరవేరుతాయని ఈశ్వరుడే చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
కోరికలు లేకుండా పూజించినా వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ మాసంలో తిథి, వారము, వ్రత ప్రాముఖ్యత లేదు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈ మాసం గురించి పరమేశ్వరుడు చెప్తూ.. ఎవరైతే శ్రావణ మాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ.. ఇంద్రియ నిగ్రహంతో గడుపుతారో వారికి అన్నీ తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్య ఫలం దక్కుతుంది. వారికి వంశాభివృద్ధి వుంటుంది. 
 
ఈ నెలలో దైవకార్యాలు స్వల్పంగా చేసినా సరే అనంత ఫలితాలను ఇస్తాయి. మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ.. సత్యాన్ని పలకాలి. అరటి ఆకులోనే భోజనం చేయాలి. ఆకుకూరలు తినకూడదు. శ్రావణ మాసంలో చేసే నమస్కారాలు, ప్రదక్షిణలు వేల రెట్ల ఫలితాన్నిస్తాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

రావణుడు ఎందుకు సీత అంగీకారము కోసము వేచి వుండాల్సి వచ్చింది?

కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

గ్రహదోషాలు తొలగిపోవడానికి నవగ్రహాలను పూజిస్తే...

పూరి నెక్ట్స్ మూవీ ఫిక్స్... హీరో ఇత‌నే..!

చదువుకోసం ఒకే గదిలో ఉంటున్నాం... అతడా పని చేశాడు... ఏం చేయాలి?

సంబంధిత వార్తలు

హిజ్రాతో సహజీవనం చేశాడు.. డబ్బు ఇవ్వలేదని గొంతు కోశాడు.. ఎక్కడ..?

కోమలవల్లిగా వరలక్ష్మి.. ఆ పేరే సర్కార్‌కు తలనొప్పి తెచ్చిపెట్టిందా?

సోష‌ల్ మీడియాను స‌ద్వినియోగం చేసుకుంటే స‌త్ఫ‌లితాలు... కొల్లు ర‌వీంద్ర‌

హీరోయిన్‌కు లిప్‌లాక్స్ ఇచ్చి ఇంట్లోను భార్యకు ఇచ్చాడు.. బాలీవుడ్ హీరో

నిజామాబాద్‌లో దారుణ హత్య... వివాహితను బ్యాగులో కుక్కి.. వాగులో?

పూజగదిలో ఈ వాస్తు దోషాలు ఉన్నాయా? (video)

తులసి కోట ఏ దిశలో అమర్చాలి..?

ఇలా చేస్తే శాశ్వత కీర్తి ఖాయం...

13-11-2018 మంగళవారం దినఫలాలు - స్త్రీలు తెలివి తేటలు...

కార్తీక మాసం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

తర్వాతి కథనం