Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్త శుభములను పొందుటకు వారధి.. శ్రీసాయి దివ్య విభూతి

శ్రీకరం పవిత్రం శోకరోగ నివారణం... లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనం... ఆరోగ్యంతో పాటు ముడిపడిన విభూతి ధరించడం నిత్యజీవితంలో చేయవలసిన దైవవిధి. ప్రకృతి నుండి బయటపడటం కోసం విభూతి స్నానం అవసరం. కొద్ది విభూతిని కొద్ది చుక్కల నీటితో తడిపి పెట్టుకుంట

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (20:58 IST)
శ్రీకరం పవిత్రం శోకరోగ నివారణం... లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనం... ఆరోగ్యంతో పాటు ముడిపడిన విభూతి ధరించడం నిత్యజీవితంలో చేయవలసిన దైవవిధి. ప్రకృతి నుండి బయటపడటం కోసం విభూతి స్నానం అవసరం. కొద్ది విభూతిని కొద్ది చుక్కల నీటితో తడిపి పెట్టుకుంటే స్నానంతో సమానం. ఆరోగ్య కల్మష హృదిలను మార్చేది విభూతి.
 
భస్మ స్నానం చేసినవాడు తన వంశాన్ని ఉద్దరిస్తాడు. దీనిని మించిన స్నానం లేదు. విభూతి సర్వ రోగాలను తిప్పితిప్పి కొడుతుంది. పిల్లల్లో వచ్చే భయాలు, జ్వరాలు మొదలైనవి దూరం చేసే హక్కు విభూతిది. లలాటం మీద విభూతిని పూసుకుంటే శిరస్సులో చేసిన పాపాలు హరిస్తాయి. బ్రహ్మని భాసితం చేస్తుంది కనుక భసితము అన్నారు.
 
అణిమాది అష్టవిభూతులు ప్రసాదిస్తుంది కనుక విభూతి అన్నారు. ఇది రక్ష. విభూతి క్రోధాన్ని హరిస్తుంది. బాహువుల మీద పూసుకుంటే పాపాలు నశిస్తాయి. నాభి మీద పూసుకుంటే పరాయి స్త్రీ వ్యామోహం దరిచేరదు. గుండెల మీద పూసుకుంటే మానసిక ఆందోళన దరిచేరదు. మూడు పూటలా విభూతి ధరిస్తే చర్మరోగాలు రావు. సమస్త శుభములను పొందుటకు వారధి.. శ్రీసాయి దివ్య విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు చెబుతాడు. అటువంటి విభూతి ధరించిన పరమేశ్వరుని పూజ శాంతిసౌభాగ్యదాయకం.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments