పెళ్లి చేస్కుంటావా? లేదంటే నీ భర్తను చంపమంటావా? ఏంటో చెప్పు నీ యవ్వారం...

ఓ ప్రేమోన్మాది బెదిరింపులకు వివాహిత వణికిపోయింది. తొలుత అతడి బెదిరింపులను లైట్ గా తీసుకున్న ఆ గృహిణికి రానురాను అవి తీవ్రస్థాయికి చేరడంతో భయపడి పోలీసు కేసు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:55 IST)
ఓ ప్రేమోన్మాది బెదిరింపులకు వివాహిత వణికిపోయింది. తొలుత అతడి బెదిరింపులను లైట్ గా తీసుకున్న ఆ గృహిణికి రానురాను అవి తీవ్రస్థాయికి చేరడంతో భయపడి పోలీసు కేసు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గాజుల రామారానికి చెందిన ఓ వివాహితను ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన ఆట్ల సతీశ్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. గతంలో అతడితో ఆమెకు పరిచయం మాత్రమే వుండటంతో దాన్ని అడ్డుపెట్టుకుని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
 
ఆమెకు పెళ్లి అయిపోయినా.... నిన్నే ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఆమె భర్తను చంపి ఆ తర్వాత వివాహం చేసుకుంటానంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె అతడి టార్చర్ భరించలేక నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కేపీహెచ్ బి ఆసుపత్రిలో చేర్పించారు. 
 
అయినాసరే ఆ ఉన్మాది ఆమెను వదల్లేదు. నేరుగా ఆసుపత్రికే వచ్చి ఆమెను మళ్లీ బెదిరించాడు. పెళ్లాడుతావా లేదా అంటూ ఆమెను బెదిరిస్తూ కత్తితో ఆమె చేతిపై గాట్లు పెట్టాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంట్లో మందుకొట్టి గోలగోల... తొంగి చూడగానే యువతిని గట్టిగా వాటేసుకుని...

అరకు ఎమ్మెల్యే కిడారిని ఎందుకు చంపారంటే...

చిన్ననాటి గురువులతో పవన్ కళ్యాణ్ .. చిన్ననాటి ఫోటో చూసి మురిసిపోయాడు...

దగ్గరుండి మరీ తినిపిస్తాడు.. అక్కడ మాత్రం చంపేస్తాడు.. చెర్రీపై ఉపాసన ట్వీట్

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

సంబంధిత వార్తలు

అయ్యా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. జనసేన పార్టీని జెండా ఎగురవేస్తా... ఎవరు?

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

గుడికెళ్లిన వికలాంగురాలిని కొంగుపట్టుకుని లాగిన కామాంధుడు

ఆంధ్రాలో మావోయిస్టుల ఘాతుకం.. కాల్పుల్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మృతి

తర్వాతి కథనం