పెళ్ళి కోసం తహతహలాడుతున్న అగ్ర హీరోయిన్..?

అందాల అనుష్క ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. హరిక్రిష్ణ చనిపోయినప్పుడు మాత్రం కెమెరా కంటికి చిక్కింది. రీసెంట్‌గా ఆమె ఒప్పుకున్న సినిమాల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (14:31 IST)
అందాల అనుష్క ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. హరిక్రిష్ణ చనిపోయినప్పుడు మాత్రం కెమెరా కంటికి చిక్కింది. రీసెంట్‌గా ఆమె ఒప్పుకున్న సినిమాల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
 
అనుష్కకు ఉన్నంత క్రేజ్ మరే హీరోయిన్‌కు లేదు. హీరోలతో సమానంగా సినిమాల్లో ఓపెనింగ్స్‌ను రాబట్టగలదు. ఈ యేడాది విడుదలైన భాగమతి సినిమాతో సోలో హీరోయిన్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకుంది అనుష్క. అంత క్రేజ్ ఉన్న అనుష్క కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదట.
 
ఇటీవల ఆమె రెండు సినిమాలు ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఒకటి మాధవన్ సరసన మూవీ. మరొకటి గౌతమ్ మీనన్ డైరెక్షన్లో. ఈ రెండు సినిమాలు ఆమె త్వరలోనే మొదలుపెడుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. అయితే ఆ సినిమాలలో తాను నటించేది లేదని అనుష్క తేల్చి చెప్పేసినట్లు సమాచారం. 
 
అనుష్క ప్రస్తుతం తెలుగు, తమిళంలోగానీ అస్సలు ఒక్క సినిమాకు సైన్ చేయడం లేదట. కారణం ఆమె తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలనుకుంటోందట. అంతేకాదు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనకు కూడా వచ్చేసిందట అనుష్క. అందుకే సినిమాలకు కొన్నిరోజుల పాటు బ్రేక్ ఇచ్చి పెళ్ళయిన తరువాత భర్త ఒప్పుకుంటే నటించాలన్న నిర్ణయానికి వచ్చేసిందట. మరి అనుష్కను పెళ్ళిచేసుకోబోయే ఆ అదృష్టవంతుడెవరన్నది వేచి చూడాల్సిందే.

డబ్బు కోసం హీరోయిన్‌గా మారిపోతున్న సింగర్.. ఎవరు?

కౌశల్ చెప్పిన రాజు-పులి కథ.. ఇక కౌశల్ సైన్యం ఏం చేస్తుందో?

'నన్ను దోచుకుందువటే' షాక్‌లో సుధీర్ బాబు... అస‌లు ఏం జ‌రిగింది..?

బావను ప్రేమించింది.. ఆత్మహత్య చేసుకుంది..

గొడవ పడుతున్న భార్యకు ముద్దిచ్చిన భర్త.. ఇదే అదునుగా నాలుక కొరికేసిన భార్య...

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

స్ట్రెచర్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు.. ఆసియా కప్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

తర్వాతి కథనం