ఎన్టీఆర్‌లో అచ్చం చంద్రబాబులానే రానా

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో పలువురు సీనియర్ నటీనటుల పాత్రల్లో యువతరం హీ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (16:06 IST)
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో పలువురు సీనియర్ నటీనటుల పాత్రల్లో యువతరం హీరోహీరోయిన్లు నటించనున్నారు. అలా.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్రలో కూడా రానా దగ్గుబాటి నటించనున్నారు.
 
రానా దగ్గుబాటి... 'బాహుబలి' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రానా.. ఎన్టీఆర్ బయోపిక్‌లో బాబు రోల్‌లో నటించేందుకు సమ్మతించాడు. ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటించనుంది. 
 
అయితే చంద్రబాబు పాత్ర కోసం తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు రానా. ఇటీవల షూటింగ్‌లో రానాకి సంబంధించిన స్టిల్స్ విడుదల కాగా, ఇవి ప్రేక్షకులకి ఎంతో ఆనందాన్ని అందించాయి. తాజాగా వినాయక చవితి శుభాకాంక్షలతో ఎన్టీఆర్‌లో రానా లుక్‌ని విడుదల చేశారు. యంగ్ ఏజ్‌లో చంద్రబాబు ఎలా ఉన్నారో అచ్చం రానా కూడా అదే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈపిక్ అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుంది.
 
ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని బాలయ్య పోషిస్తుండగా, ఆయన సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుంది. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 9వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. 

పరువు కోసం మారుతీరావే చావాలి... రాంగోపాల్ వర్మ

మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ని "(నన్ను) దోచుకుందువటే"... మూవీ రివ్యూ

కో-ఆపరేట్ చేస్తాననే ఛాన్సిచ్చారు... ఇరగదీస్తానంటున్న వెంకటలక్ష్మి

ఎన్టీఆర్ కుమార్తెను అందలమెక్కించిన ప్రధాని నరేంద్ర మోడీ

విమానం గాల్లో వుండగా లవ్ ప్రపోజ్ చేసి వాటేసుకున్నాడు... ప్రియురాలి వుద్యోగం ఊడింది...

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

తర్వాతి కథనం