Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య చాలా హ్యాపీ.. వదంతులు నమ్మొద్దు : సొనాలీ బింద్రే భర్త

కేన్సర్‌తో బాధపడుతున్న తన భార్య సొనాలీ బింద్రే చాలా సంతోషంగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. 'సోష‌ల్ మీడియాని మ‌రింత బాధ్యతాయుతంగా వాడాలని దయచేసి నేను

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (15:21 IST)
కేన్సర్‌తో బాధపడుతున్న తన భార్య సొనాలీ బింద్రే చాలా సంతోషంగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. 'సోష‌ల్ మీడియాని మ‌రింత బాధ్యతాయుతంగా వాడాలని దయచేసి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా భార్య గురించి వ‌స్తున్న వదంతులు అస్స‌లు న‌మ్మోద్దు, వాటిని స్ప్రెడ్ చేయోద్దు. దీని వ‌ల్ల కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌నే విష‌యం మ‌రువ‌ద్దు' అని గోల్డీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
కాగా, ప్ర‌ముఖ న‌టి సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఎప్పటికపుడు ఆమె భర్త గోల్డీ బెహెల్ సోష‌ల్ మీడియా ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నాడు. 
 
ఈనేపథ్యంలో తాజాగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్... త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌ముఖ న‌టి సోనాలి బింద్రే అమెరికాలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు ట్వీట్ చేశారు. ఆమె మృతికి సంతాపం కూడా ప్ర‌క‌టించారు. అయితే ఓ నెటిజ‌న్ అది ఫేక్ అని చెప్ప‌డంతో వెంటనే పాత ట్వీట్ డిలీట్ చేసి మ‌రో ట్వీట్ చేశారు. 
 
రెండు రోజులుగా సోనాలి లేరు అని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. ఆమె ఆరోగ్యంగా ఉండాల‌ని, హైగ్రేడ్ క్యాన్స‌ర్ నుండి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఈ విష‌యంపై సోనాలి భ‌ర్త గోల్డీ బెహెల్ తాజాగా ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments