పోలీస్ ఇన్‌స్పెక్టర్ కాదు.. ప్రజారక్షకుడు.. గ్రేట్ జాబ్ అంటూ కమిషనర్ కితాబు

సమాజంలో ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. రోజురోజుకూ వీటి సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నారు.

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (16:03 IST)
సమాజంలో ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. రోజురోజుకూ వీటి సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నారు. కానీ, నేరగాళ్లు మాత్రం హెటెక్ టెక్నాలజీతో ముందుకు దూసుకెళుతున్నారు. దీంతో కొన్ని కేసుల్లో నిందితులను గుర్తించడం అసాధ్యంగా మారింది. ఇలాంటి సమయాల్లో కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలో అత్యంత కీలకంగా మారుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, కంపెనీలు, ఆఫీసులు, దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జీలు తదితర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఆయన రాష్ట్రాల పోలీసు శాఖలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అలాగే, ప్రధాన రహదారుల్లో ఉండే కూడళ్ళలో ట్రాఫిక్ పోలీసు విభాగమే వీటిని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది.
 
అయితే, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఎన్ని సీసీటీవీ కెమెరాలు అమర్చినప్పటికీ నేరాలను అరికట్టడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఇలాంటి నగరాల్లో అనేక కేసుల్లో ప్రధాన నిందితులను ఇప్పటికీ గుర్తించలేని పరిస్థితి ఏర్పడివుంది. అందుకే గ్రేటర్ చెన్నై నగర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేయాలని నగర పోలీసు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
 
ఈ ఆదేశాలను శిరసావహించిన ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్.. తన ఠాణా పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసి రికార్డు స్థాయిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదీ కూడా ఒక్కరోజులోనే ఏకంగా 60కి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చేలా చర్యలు తీసుకున్నారు. ఆ ఇన్‌స్పెక్టర్ పేరు ఆదిమూలం. చెన్నై నగర శివారు ప్రాంతమైన పమ్మల్ మున్సిపాలిటీ పరిధిలోని శంకర్ నగర్ ఎస్-6 పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్.
 
చెన్నై నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లతో పోల్చితే.. ఈ ఒక్క స్టేషన్‌లోనే అధిక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం గమనార్హం. దీనికి కారణం ఇన్‌స్పెక్టర్ ఆదిమూలం వ్యక్తిగత శ్రద్ధ. ఎంతో నిజాయితీపరుడిగా పేరుగాంచిన ఈయన... తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అన్ని వీధుల్లో ఉన్న వ్యాపారులతో పాటు హోటల్స్, విద్యా సంస్థలు, గృహ యజమానులతో వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడుతూ, వారిలో అవగాహన కల్పించి, వారితోనే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగానే ఒకే రోజు ఏకంగా 60కి పైగా కెమెరాలను అమర్చారు. ఆయన చర్యను నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ సైతం.. గ్రేట్ జాబ్ అంటూ మెచ్చుకోవడం గమనార్హం.
 
ఇన్‌స్పెక్టర్ ఆదిమూలంలా ప్రతి ఠాణాలోని ఇన్‌స్పెక్టర్లు తమ విధులు నిర్వహిస్తే నేరాలు అనే మాటకు తావుండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పైగా, గత కొన్ని రోజులుగా ఈ ఠాణా పరిధిలో నేరాల సంఖ్య కూడా బాగా తగ్గినట్టు పమ్మల్ వాసులు పేర్కొంటున్నారు. 

భార్యపై ఇద్దరితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన మాజీ భర్త

ప్రియురాలు ఆ పని చేయడంతో అర్థరాత్రి అల్లాడిపోయిన చెన్నై ప్రియుడు

మగాళ్లను అలా పిలుస్తున్నారా.. అయితే దావా వేయండి : బాంబే హైకోర్టు

హరీష్‌ రావుకు మాపై అసూయ.. కేసీఆర్ వ్యాఖ్యలు

చెన్నై ట్వంటీ20 : వెస్టిండీస్ చిత్తు ... భారత్ తీన్‌మార్

సంబంధిత వార్తలు

హీరోయిన్‌కు లిప్‌లాక్స్ ఇచ్చి ఇంట్లోను భార్యకు ఇచ్చాడు.. బాలీవుడ్ హీరో

ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..

మాధవన్ సరసన అనుష్క.. మరో యేడాది పెళ్లి లేనట్టేనా?

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ : బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు...

4, 6 nb, 6 nb, 6, 1, 6, 6, 6తో కివీస్ బ్యాట్స్‌మెన్ల వరల్డ్ రికార్డ్

జెడి రె"ఢీ" - మూడు రోజుల్లో సొంత పార్టీ.. ఆ నగరంలో సొంత కార్యాలయం..?

50 మంది బాలికలపై అకృత్యానికి పాల్పడిన కామాంధుడికి జైలు

ఒక్క ఫోన్ కాల్‌తో ఆ యువకుడి జీవితంతో ఆడుకుంది...?

ఆమెతో గడిపేందుకు చెన్నై నుంచి వెళ్లిన ప్రియుడు.. మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

బీఎండబ్ల్యూ కారులో నాగుపాము... బయటకు తీయడానికి ఏం చేశారో తెలుసా?

తర్వాతి కథనం