Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైయ్యాక ఎందుకొచ్చావ్.. ముఖం చాటేసిన ప్రియుడు.. కారులో వెళ్తూ..?

ఒకవైపు ప్రియుడికి దూరమైన ఆవేదన వేధించింది. మరోవైపు తల్లిదండ్రులు వేరొక వ్యక్తితో వివాహం చేసేశారు. పెళ్లైనా ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్లింది. కానీ ప్రియుడు ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకున్న ప్రేయసితో వుం

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:00 IST)
ఒకవైపు ప్రియుడికి దూరమైన ఆవేదన వేధించింది. మరోవైపు తల్లిదండ్రులు వేరొక వ్యక్తితో వివాహం చేసేశారు. పెళ్లైనా ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్లింది. కానీ ప్రియుడు ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకున్న ప్రేయసితో వుండేందుకు నిరాకరించాడు. అంతే ఇక చేసేది లేక.. తన మాజీ ప్రియుడు కాదన్నాడనే మనస్తాపంతో ఓ వివాహిత కారును డ్రైవ్ చేస్తూనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరానికి చెందిన సుమ అనే యువతి ఓ యువకుడిని ప్రేమించింది. అయితే సుమ తల్లిదండ్రులు ఆమె ప్రేమించిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ... ఆమె మాజీ ప్రియుడిని మరిచిపోలేకపోయింది. భర్తకు దూరమై పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆమెకు నచ్చజెప్పి తల్లిదండ్రులు భర్త వద్దకు పంపారు. 
 
కానీ ఆమె భర్త ఇంటికి కాకుండా తన ప్రియుడి ఉంటున్న తుముకూరు దగ్గరకు వెళ్లింది. పెళ్లి చేసుకుని మళ్లీ తన దగ్గరకు ఎందుకు వచ్చావని మాజీ ప్రియుడు సుమను ప్రశ్నించాడు.. అంతేకాకుండా ఆమెతో ఉండేందుకు నిరాకరించాడు. ప్రియుడి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన సుమ కారులో వెళుతూనే నిద్రమాత్రలు మింగేసింది. 
 
అంతే స్పృహ కోల్పోయి కారులో తమ ఇంటికి వచ్చిన కుమార్తెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments