కోల్‌కతాలో కూలిన వంతెన.. బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి. దక్షిణ కోల్‌కతా, అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెజర్‌హట్ అని పిలువబడే ఈ బ్రిడ్జి నగరం

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (18:00 IST)
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి. దక్షిణ కోల్‌కతా, అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెజర్‌హట్ అని పిలువబడే ఈ బ్రిడ్జి నగరంలోని పురాతన వంతెనల్లో ఒకటి. ఈ వంతెన కింద రైల్వే ట్రాక్. పైన వాహనాలు వెళ్లేందుకు వీలుంటుంది. 
 
ఈ బ్రిడ్జి పురాతన కాలం నాటిది కావడంతో ఒక్క సారిగా కుప్పకూలింది. 2016 మార్చిలో సెంట్రల్ కోల్‌కతాలోని బుర్రబజార్‌లో కూడ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి సహాయక చర్యలు చేసి శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో సుమారు 90 మందికి పైగా గాయపడ్డారు. 
 
తాజాగా మంగళవారం చోటుచేసుకున్న కోల్‌కతా వంతెన కూలిన ప్రమాదంలో ఏడుగురు గాయాలపాలైయ్యారు. తొమ్మిది మందిని ఇప్పటికే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 

ఆంధ్రా బ్యాంకుకి పంగనామం... రూ. 5 వేల కోట్లు ఎగనామం...

రైళ్లలో దోపిడీకి యత్నిస్తే కాల్చివేత: జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ సమావేశంలో నిర్ణయం

నగ్నంగా వివాహం చేసుకున్నారు.. వాళ్లిద్దరూ ప్రకృతి ప్రేమికులట...?

బిగ్ బాస్... ప్లీజ్ ఎలిమినేట్ కౌశల్... కత్తి మహేష్ సంచలనం

ఆయన నా భర్త.. కాదు నా మొగుడు.. కన్నడ నటుడి కోసం రోడ్డెక్కిన ఇద్దరు భార్యలు

సంబంధిత వార్తలు

అయ్యా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. జనసేన పార్టీని జెండా ఎగురవేస్తా... ఎవరు?

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

అమృత్ పథకం నిర్వహణలో ఏపీ ఫస్ట్... ఇదిగోండి సర్టిఫికేట్: తెలంగాణ వెనుకబడిపోయిందే?

మార్కెట్లోకి మోటోరోలా వన్ పవర్ ఫోన్... ప్రత్యేకతలు ఏంటి?

తర్వాతి కథనం